అంతర్ముఖం

ఒంటరితనం మనిషిని ఏదేదో చేస్తుందన్నది అందరికీ అనుభవైకమే అనుకుంటా?

సమూహంలో కూడా ఒంటరితనం ఫీలవుతుంటాను నేను. అందరితో మాటాడుతున్నట్లే వున్నా అదేదో జారుడుబల్లమీద జారిపోతున్నట్లుగానే వుంటుంది. ఎదురుగా వున్నవాళ్ళలో మనలా ఆలోచించే వాళ్ళు లేకపోవడం, మానసికంగా దగ్గరితనం కలిగినవారు వుండకపోవడం ఈ వెలితికి కారణంగా ప్రతి క్షణం అనిపిస్తుంది. కానీ ఏవో మాటల్లో పడి కొద్ది సేపు అలా బయటపడినా మరల అంతర్ముఖుడినయిపోతుంటాను. ఇది చదువుకున్న రోజుల నుండి తక్కువగా వుండేది.  స్నేహితులు కూడా అతితక్కువమందిగానే వుండి కొన్ని అంశాలలోనే దగ్గరితనం వుండడంతో  మరల ప్యూపా దశకు చేరేవాడిని. అలాగని నాతో స్నేహం చేసేవాళ్ళు మరిచిపోయేవాళ్ళుకాదు. వారికి నాతో మాటాడడం రిలీఫ్ గా ఫీలవుతున్నాం అనేవారు. కానీ నాకు ఆ ఫీల్ కలగలేదు.

వివాహితుడనయినా, పిల్లలు మరల చదువులకు పై వూళ్ళకుపోవడంతో మరల అది ఎక్కువయింది. దానినుండి బయటపడడానికి శక్తికి మించినదయినా ఇలా ఈ అంతర్జాలలోకంలో నా మనసుకు నచ్చిన వాక్యాలను వెతుక్కుంటూ గడిపేస్తున్నా. అయినా మరల ఏదో గిల్టీ ఫీలింగ్ వెంటాడుతుంటుంది.  ఏమీ చేయలేకపోతున్నామే అని మదనపడడమే. మరల ఉపకారం పొందినవారు చేసిన ద్రోహం గుర్తొచ్చి అది కూడా మంచిది కాదన్న అభిప్రాయం ఏర్పడింది. అయినా చేతనయినంతలో మంచి చేయడానికే మొగ్గు చూపుతుంటాను. ఎవరికైనా కష్టం కలిగితే ఓర్చుకోలేనితనం (ఇది గొప్పకోసంకాదు). వెంటనే స్పందిస్తాను. కానీ అది ఒక్కోసారి నాకే అపకారంగా మారుతుంటుంది.  అయినా సగటు మానవుడిగా బయటపడలేకపోతున్నా.  ఈ బలహీనతవలన ఎదుటివారికి చేతకాని దద్దమ్మలా, అమాయకుడిలా కనిపిస్తుంటాను.  వెటకారమాడేవాళ్ళని అలా చూస్తూ వుండిపోతుంటాను.  అది వారి తెలివితక్కువతనమేలే అని నన్ను నేను సమర్థించుకుంటాను. కానీ మరల నాలో మదనం మొదలు. వెంటనే నువ్వెందుకు రియాక్ట్ కాలేకపోయావు అని. వదిలేయిలే అని కొద్దిసేపు కనులు మూసుకుంటాను.  ఇది చేతకానితనమా?

అందరిలా తుళ్ళుతూ తిరగలేనితనం ఎలా ఒంటబట్టిందో? ఇంక మారదేమో? మా అమ్మ అంటూ వుంటుంది ‘పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోతుందిరా’ అని. నిజమేనేమో.

ప్రకటనలు

2 comments

  1. మిత్రమా ముందుగా మీరు సెల్ఫ్ పిటీని వదిలేయండి. గతంలో నేను కూడా అచ్చు మీలానే ఆలోచించేవాడిని. మన వేవ్ లెంగ్త్ కు తగ్గ మిత్రులు లేరని ఫీలయ్యేవాడిని. అది శుద్ధ తప్పు. అది మనలోని లోపమే. ఎదుటి వారి వేవ్ లెంగ్త్ కు మనమే మారాలి. ఎంతలా మన మాదిరి ఆలోచించేవాడు దొరికినా వాడికి మనకీ కూడా కొన్ని చొట్ల కుదరకపోవచ్చు. మనం కలిసే మిత్రుల్లో కూడా అలాంటి వైవిద్యం ఉండాలి. లేకపోతే జీవితం బోరు కొట్టదూ.
    ఇతరులకు సహాయపడటం వరకే మన వంతు వాళ్ళు మర్చిపోతే పోనీయండి. ఒకసారి భగవద్గీతను గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మిమ్మలని ఎవరు వెటకారంగా మాట్లాడుతారు? మీరు ఆ చాన్స్ ఎందుకు ఇస్తారు ? తిరిగి తిప్పికొడితే వారే నోరు మూసుకుంటారు.
    నేనైతే ప్రతి క్షణం నవ్వడానికే ప్రయత్నిస్తుంటాను. నవ్వే నా ఆయుధం. ఎవరు కలిసినా కనీసం ఒక నిమిషమైనా నవ్వుకుని విడిపోవాలి. అది నా పాలసీ.
    ఒక మంచి రోజుతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్.

    1. ధన్యవాదాలు. నేను ఎంత ప్రయత్నించినా ప్యూపా దశను దాటలేకపోతున్నా. గుండెలలో దాగిన మంచు పిడికిలి వత్తిడి కరిగే వెచ్చని కరచాలనం కోసం ఎదురుచూపుతోనే జీవితం ముగిసిపోతుందేమో?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s