
సూరీడు గుర్తు పెట్టుకొని ఏదో సమాజంలో మార్పు తీసుకు వచ్చేస్తాను, సామాజిక న్యాయం నినాదంగా ఊదరగొట్టిన చిరంజీవి తన లోతు గుండెలో ఇన్నాళ్ళు దాచుకున్న యవ్వారాన్ని ఈరోజుకు బయటపెట్టుకొని ఊపిరి పీల్చుకున్నాడు. అధికార లాలసతతో మొదలుపెట్టిన తన రాజకీయ ప్రస్థానాన్ని ఇలా మరో మెట్టు పైకెక్కడానికి ఇలా బోర్డు తిప్పేయడం చూస్తుంటే ఇంత సిగ్గుమాలిన రాజకీయాలను చూస్తూ ఊరుకున్న మన నిస్సహాయత పట్ల అసహ్యమేస్తోంది. మొత్తమ్మీద తన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప దీనివలన రాజకీయాలలో ఏమీ పెను మార్పులు రాకపోవచ్చు. అసలే అసమ్మతి కుంపట్లతో ఉడుకుతున్న కాంగ్రెస్ నెత్తిన మరో కుంపటి పెట్టుకుండే తప్ప ఇది మరోటి కాదు. ఈ విలీనం వలన మరింత గందరగోళంకు గురవుతూ ఇంక ఇంతవరకు బయటపడని వారు అటు జగన్ వైపో, టి.డి,పి. వైపో గెంతడం తథ్యం.
మరో పెద్ద జోక్ ఈ రోజు చిరంజీవి నోటి వెంట వచ్చిందిః అవినీతిపై కాంగ్రెస్ తీసుకున్న చర్యలు తనను ఆకర్షించిందంట. ఇంత కంటే హాస్యాస్పదమైనదేమైనా వున్నదా? అంటే ఇంక రెండు చెతులా సంపాదించ వచ్చునని చిరు ఆశ పడుతున్నట్లున్నాడు.. హతోస్మి..





