నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుడిని ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలానే దిగువ మధ్యతరగతి వారిని మరింత కుంగదీసేట్లుగావున్నాయి.
సబ్సిడీలను తగ్గించుకుంటు వస్తున్న బడ్జెట్ ప్రతిపాదనలు దీంతో పూర్తిగా మరింతగా బట్టబయలై సామాన్యుడి నడ్డివిరిచేదిగా తయారయ్యింది. ఆర్థిక మంత్రి ఎవరైనా మన ప్రధాన మంత్రిగారి సంస్కరణల విరాట్ స్వరూపం ఆవిష్కృతమవుతోంది.
దేశ ఋణభారం 39,44,598 కోట్లు కాగా తలా ఒక్కీంటికీ 34,300 రూ.ల అప్పు సర్దారు.
అర్థ రాత్రి నుంచి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో యిప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు మరింత పెరిగి సామాన్యుల జీవన స్థితిగతులు పూర్తిగా అడుగంటే ప్రమాదముంది.
ప్రభుత్వ రంగ సంస్థలనుండి పెట్టుబడుల ఉపసంహరణ వలన ప్రైవేటుస్వామ్యంవైపు పూర్తిగా మొగ్గుచూపుతూ, జీవన భద్రతనుండి వెనుకంజ వేస్తోంది.
ఎరువుల సబ్సిడీలకు 12 శాతం మేర తగ్గించడంతో పాటు MRP కూడా అవసరం లేదనడం రైతుల మెడవిరిచే పని మరింత షురూ చేసినట్లే. యిప్పటికే పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, మార్కెటుకు తనకు వచ్చే ధరకు హస్తిమసికాంతరం తేడాతో ఏమీ పాలుపోని రైతన్నకు ఆత్మహత్యలే శరణ్యం.
గత బడ్జెట్ లలానే కేటయింపులకు, నిధుల విడుదలకు పొంతనలేక సామాన్యుడి బతుకు మరింత బారం కావడం ఖాయం.
కాకిలెక్కలతో ఆర్థిక సంక్షోభంనుండి బయటపడ్డామని డంబాలు పలకడమే తప్ప ప్రణాలికాబద్ధమైన కృషి జరపడంలో విఫలమవుతూనే వున్నాం…