
ఆయేషా మీరా హత్య కేసులో నిందితునిగా నేరారోపణ చేయబడ్డ సత్యంబాబు వాయిదాలకు వచ్చేటప్పుడు పోలీసు కానిస్టేబుళ్ళ చేతులమీదో, కాళ్ళీడ్చుకుంటూనో వస్తున్నది అందరికీ తెలిసినదే. నిమ్స్ నుండి విజయవాడకు వాయిదాకు తీసుకు వస్తుండగా 11 మంది సాయుధ పోలీసుల పహరా నుండి ఎలా తప్పిపోయాడో అని అందరికీ ఇప్పుడు భేతాళ ప్రశ్న. సత్యం బాబు తల్లి మరియమ్మ తన కుమారుడ్ని చంపేసే ఉద్దేశ్యంతోనే యిలా కాకమ్మ కథలు అల్లుతున్నారని ఏడుస్తోంది. అటు ఆయేషా తల్లి కూడా కేసును మూసివేసే ఉద్దేశ్యంతో సత్యంను చంపే పథకంలో భాగంగానే ఇలా చేసారని ఆవేదనగా ఆగ్రహంగా తిడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులే టెఱరిస్టులని ధర్మాగ్రహం (TV5లో) వెల్లగక్కారు.
ఈ కేసులో ముందునుండీ సామాన్యజనానికి ఎన్నో సందేహాలను మిగిల్చారు. అసలు నిందితులను దాచే ఉద్దేశ్యంతోనే మొదట లడ్డూ అని, తరువాత ఈ సత్యంబాబును తెరపైకి తెచ్చారు. సత్యంబాబు నోటితో కూడా తానే నిందితుడ్ని అని చెప్పించారు. తరువాత కోర్టులో తనకు ఈ కేసులో ఇరికించారని చెప్పాడు. దాంతో ఆయనకు కాళ్ళూ చేతులు పడిపోయిన జబ్బు వచ్చింది.
యిలా ప్రత్యూషలు, ఆయేషాలు అమానుషంగా బలయిపోయినా పట్టించుకునే నాధుడే లేడు. మొదటి దానిలో ప్రస్తుత ప్రతిపక్షం వాళ్ళూ అధికారంలో వుండగా జరగగా, రెండోది జరిగి అప్పుడే మూడేళ్ళూ దాటిపోయాయి. దివంగత వైఎస్ గారి పాదాలమీద పడి వేడుకున్నా చిరునవ్వుతో ఆశీర్వదించారే తప్ప నేరస్తులు బయటపడలేదు. పేదవాడు, దళితుడు అయిన సత్యంబాబు పై ఇది రుద్దబడిందిగానే అన్నం తిన్న ఎవరికైనా అర్థమౌతుంది. పాపముపశమించుగాక…
Like this:
Be the first to like this post.