జగన్ ఓదార్పు జాతరను సూసి సిగ్గుపడాలో, ఆనందపడాలో అని మా బొత్సబావ్ ఈ రోజు అనేసినాడని ఇప్పుడే సూసినాన్ బావ్. మరేటంతే, సెప్పనేకపోతున్నాను కాని బావ్ యీళ్ళ యవ్వారమంతా సూసి మనకు మనం సిగ్గుపడిపోతున్నామన్న ఇసయం ఎరుకనేదా బావ్ యీళ్ళకి. ఇలపింటి రాజకీయ రంగులరాట్నం ఎక్కించేసి మనల్ని గిరగిర తిప్పేసి కొడుతున్న యీల ఏసకాలకి మూలనున్న మా నాయనమ్మ దగ్గరినించి అంతా తుపుక్కున కాండ్రించి ఉమ్మేత్తుంటే మా బొత్సబావ్ కొత్తగా సిగ్గుపడిపోతున్నాడంట. ఓర్నాయినో, ఇదేదో కొత్త సినిమా డవిలాగ్ నాగుంది. బావ్, మనల్ని జూసి జనం సిగ్గుపడుతున్నారన్న యిసయం తమరు ఎంత గభీల్న ఎరిగితే అంత మంచిది బావ్. నేకపోతే జనం మరింత సిగ్గుతో సచ్చిపోతార్ బావ్.
అటు సంద్రబావ్ నాయుడు రాజకీయాల్లో యిలువల్లేవ్ అనీసి తెగ గింజుకుపోతున్నాడ్ బావ్, అది ఎలగుందంటే పెరట్లో పెనక్కి అగ్గెట్టేసి, మునోట అత్తా నా ఒళ్ళు వొణుకుపోతుందే అన్న కోడలు యవ్వారం నాగుంది బావ్.
సీ, దీ… మ్మా రాజకీయాలు, పేపరు తిరగెయ్యనేకపోతున్నాం, టీవీ ఎయ్యనేకపోతున్నాం..
వార్త ఆధారం(దట్స్ తెలుగు)



