అయ్యా, మా బొత్స బావ్ అంటే అంత ఈర్ష్య పడిపోతుంటారయ్యా అందరూను. ఇంతింతై వటుడింతై అన్నట్లు మా వోడు మఱిసెట్టు నెక్క ఊడలు దిగబారించేసినాడు మా జిల్లాలో..
మరొకడెవుడూ జిల్లాలో అడుగుపెట్టనీకుండా తన సామ్రాజ్యం ఇస్తరించేసినాడంటే నమ్ము.. ఇంకొకడెవుడు బ్రాందీ, సారా వేపారానికి రానీయక ఓల్ సేల్ మొత్తం సిండికేట్ తనసేతుల్లోనే..
జిల్లా కేంద్రంలో పెబుత్వ జాగాలల్లో తన మల్టిప్లెక్స్ లు కట్టించేత్తున్నాడు బావ్..ఎప్పుడైనా మా ఇజీనగరం వొత్తే బస్సుల కాంప్లెక్సుకాడాగి ఒకమారు ఎదురుగుండా సూడండయా బావ్.. అక్కడ వున్న పెభుత్వ జాగా మొత్తం లీజుకు తీసుకున్న అంబికా కంపెనీ వోడ్ని బయపెట్టి ఈయన గారు దొబ్బేసి పెద్ద మల్టీప్లెక్స్ కట్టేత్తున్నాడంతారయ్యా. నిజం ఆ పెరుమాల్లకే తెలియాలయ్యా. అలాగే మరి ఆ సుట్టుపక్కలెక్కడా జాగాలు మిగలనీయలేదు.. అటు గోదారమ్మ జిల్లాల్లో కూడా పాగా ఏసీనాడని ఇనికిడి..
జిల్లాలో అంగన్వాడి నుండి కలెక్టర్ పోస్టు దాకా మా బావ్ మేనల్లుడు బావ్ సూసుకుంతాడని మావోడు ఎక్కడున్నా గుండెమీద సెయ్యేసి ఆయిగా నిద్రపోతాడునెండి. ఎందుకంటే ఆబావ్ అలాపిలాటి బావ్ కాదు మరి. ఆ బావ్ సెల్లెత్తినాడంతె పనైపోయిందన్నలెక్కే.. ఎవురికైనా ఏటి కావాలి బావ్ ఇంతకమ్టే.. ఇలపింటి మనుసులు ఎందరు కావాలి..ఒక్కల్జారా…
బావ్ ఈ పాలి ఎలచ్చన్లొత్తే మొత్తం నియోజకవర్గాలన్నీ మా బావే (అంటే తమ్ముళ్ళు, బావా బామ్మర్దులు, మేనళ్ళుల్లు) పోటీ సేస్సెనా ఆచ్చర్యపోనక్కర్లేదు బావ్.
రిజర్వుడు వంతారా ఆయన సెప్పులు మోసినోల్లూ ఇప్పుడు సానా మంది వున్నార్లెండి.
రానున్న పంచాయతీ ఎన్నికల్జూడండి మా సెడ్డ రంజుగుంతాయి మరి. ఇంక తన ఇస్వరూపం సూడాల్సిందే..
ఈ దెబ్బతో బీసీ వోట్లన్నీ ఆయనకే..ఆయన పార్టీకే ఏసేత్తారని అమ్మగారు సా సెడ్డ నమ్మకంతో ఈజీగా కుర్సీలో సారగిలబడ్డారని తేలుతోంది. మరి మా వోడు అలాపింటిలాపింటి ప్లాన్లేత్తాడనుకున్నారేటి.. ఈ దెబ్బతో ఎగస్పార్టీవోల్లందర్నీవోల్ మొత్తం సాపలో సుట్టేసి మా పెదచెరువులో ఇసిరేత్తాడు సూడండి…
ఒకపాలి తీరిక జేసుకొని మీరొచ్చి సూసి ఈ వట వ్రుచ్చం కింద గానోదయం పొంద ఇన్నపం.. మా సెడ్డ మనోవికాసం పొందుతారని ఆమీ..ఉండండి మరి నా బీడీ ఐపోవచ్చింది…


