జూడాలకు మద్దతు తెలుపుదాం…

రాష్ట్రంలో గత నెలరోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె పట్ల ప్రభుత్వం రక రకాల వ్యాఖ్యానాలు చేస్తూ వైద్య విద్యార్థుల పట్ల ద్వేష భావాన్ని పెంపొందింప జేయడమే తప్ప వారి డిమాండ్ల పట్ల సముచిత వైఖరిని అవలంబించి సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా మొన్నటికి మొన్న 108 సిబ్బంది సమ్మె చేస్తే RTC డ్రైవర్ల తో నడుపుతామన్నట్టుగా ఆసుపత్రులను కూడా ఇష్తమొచ్చిన వారితో నడిపి ప్రజల ప్రాణాల పట్ల చులకన భావం చూపుతోంది.

జూడా ల డిమాండ్లలో మొదటిది రూరల్ సర్వీసు పట్ల వ్యతిరేకత. దీనిని సాకుగా చూపి ఒక్కో వైద్య విద్యార్థికి పాతిక లక్షలు ఖర్చు పెడుతున్నట్టుగా చెబుతోంది పాలక వర్గం. కానీ ఇది నిజం కాదు. ప్రభుత్వాసుపత్రులలోని రోగులపైన, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చును కలిపి వైద్య విద్యార్థి ఖర్చులో కలిపి చూపుతున్నారు. గ్రామీణ ఆసుపత్రులలో నేడు రిటైర్మెంటుకు దగ్గరగా వున్న వైద్యులు తప్ప మిగిలిన పోస్టులన్నీ అప్పుడే రిలీవైన విద్యార్థులతో నింపి గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల చులకన చూపు చూస్తున్నది ప్రభుత్వం. ఎక్కడ ఏ ఆసుపత్రులలోను గ్రామీణ పిహెచ్ సిలలో ఎవ్వరూ స్థానికంగా వుండి లేక శ్రద్ధతో వైద్యం చేస్తున్న వారే కరవయ్యారు. అప్పటికే ఓ ఆరేడేళ్ళు కాలేజీలలో చదువు ముగించుకొని వచ్చిన వార్ని బలవంతంగా వారికి ఇష్టంలేని ఉద్యోగం చేయమంటే శ్రద్ధ వుంటుందా? ఈ విధంగా రెగ్యులర్ ప్రభుత్వ వైద్య ఉద్యోగాలను తగ్గిస్తూ పోతున్నది. తద్వారా వైద్య రంగాన్ని సంక్షేమ రంగం నుండి తప్పించే యత్నంలో భాగంగా గుర్తించాల్సిన అవసరముంది.

అలాగే స్టైపెండు పెంచమనడంలోనూ వారి డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించడంలేదు. వెనకబడిన ఉత్తరప్రదేశ్ కంటే తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు ఆర్నెల్లకోసారి నిధులు విడుదలచేస్తూ వారి చధువునకవసరమయ్యే వసతి సౌకర్యాల పట్ల శ్రద్ధ చూపకుండా వ్యవహరిస్తున్నారు. ఏ కళాశాలలోనూ గ్రంధాలయాలలో ఎప్పటివో పాత పుస్తకాలు తప్ప కొత్తగా వస్తున్న జర్నల్స్ కానీ వైద్య గ్రంధాలు కానీ లేని నిజం అందరికీ తెలిసినదే. ఒక్కో జర్నల్ సుమారు వెయ్యి రూపాయలు విలువగలవి ప్రతి నెలా కొనుక్కొని చదివే స్థోమత ఎంతమంది విద్యార్థులకు వుంటుంది. ప్రభుత్వ కళాశాలలలో చదివే విద్యార్థులలో అధిక శాతం మంది పేద మధ్యతరగతి బడుగు జీవుల పిల్లలే అయివుంటారన్నది నిజం కాదా..

వీళ్ళ సమ్మె జరిగే కాలంలో ఆసుపత్రులలో జరిగే సాధారణ మరణాలన్నీ లెక్కకట్టి వీళ్ళ ఖాతాలో జమచేయడం ఎంతవరకు సమంజసం?

ప్రతీ ఆర్నెల్లకోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు, సౌకర్యాలు పెంచుకుంటున్న పాలక వర్గం నిజానికి వైద్య విద్య పట్ల ఎంత శాతం నిధులు ఖర్చు చేస్తున్నదో బహిరంగ పరచగలరా? విడుదలైన నిధులలో ఎంత శాతం కళాశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు? ఎంత పెద్ద మొత్తంలో అధికారులు, రాజకీయ గణం బొక్కుతున్నారో బహిరంగంగా చెప్పగలరా?

ప్రజల డిమాండ్ల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే ముఖ్యమంత్రి మరో నీరో గా తన్ను తాను ఋజువు పరచుకోవడానికి తప్ప పాలన పట్ల శ్రద్ధలేదన్నది ప్రజలకు ఎరుకైనది. అలాగే వైద్యం పట్ల ఏమాత్రం అవగాహన లేని వారికి ఆ శాఖను అప్పగించి రౌడీలులా మాటాడిస్తున్నారు తప్ప సమస్యను సానుకూలంగా పరిష్కరించే కృషి జరగడంలేదు. ఈ విధంగా చేస్తూ చెంచా లాయర్లతో ప్రజా వ్యాజ్యాల ద్వారా కోర్తుల ద్వారా సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తూ నియంతలా వ్యవహరిస్తు వైద్య విద్యార్థులపట్ల ప్రజలలో ఏహ్యభావాన్ని తెచ్చే ప్రభుత్వ ధోరణిని ఖండిస్తూ జూ.డా.లకు మద్దతు తెలుపుదాం.

13 thoughts on “జూడాలకు మద్దతు తెలుపుదాం…

  1. The demands of junior doctors are not justified. I do not understand what their problem is if the course contains the rural service as part of it. Their demand for more stiphend can be considered to some extent but there is a limit to what we can pay for a trainee doctor.

    For the Government, They need political leadership and acumen to solve the issue justly and keep the things moving. The government is pretty much hopeless and is trying to villanize some folks to cover their incompetency.

  2. అప్పటికే ఓ ఆరేడేళ్ళు కాలేజీలలో చదువు ముగించుకొని వచ్చిన వార్ని బలవంతంగా వారికి ఇష్టంలేని ఉద్యోగం చేయమంటే శ్రద్ధ వుంటుందా?……

    అసలు కిటుకు అంతా అక్కడే ఉంది…రెగ్యులర్ గా డాక్టర్ ని అక్కడ నియమించకుండా వీళ్ళతో నెట్టుకు రాడానికి ప్రయత్నించబోతోంది గవర్నమెంటు…అది ఉద్యోగం కాదు..ఒకఏడాదో రెండేళ్ళో బలవంతపు పోస్టింగ్…అక్కడ వాళ్ళు ఎప్పుడు పోస్టింగ్ పూర్తి అవుతుందా…ఎప్పుడు పోదామా అని చూస్తారు తప్పా సిన్సియర్ గా వర్క్ చేయరుగాక చేయరు..అయినా పూర్తి కాలమ్ ఉండేలా వైద్యులకు ఉద్యోగమివ్వాలిగాని…ఏడాదికి ఒకడి తో బలవంతపు సంసారం చేయించాలనుకోవడం మన మూర్ఖ రాజకీయనాయకుల తెలివితక్కువ నిర్ణయాలకు నిదర్శనం…కాబట్టి ఈ బలవంతపు గ్రామీణ పోస్టింగ్ ను కొత్త డాక్టర్ల మీద రుద్దకుండా…పూర్తి స్థాయి లో డాక్టర్ల నియామకాల్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం చేపట్టాలి….రిక్రూట్ మెంట్ జరపమనండీ…

    http://kvsv.wordpress.com/2012/02/03/%E0%B0%88-%E0%B0%AA%E0%B0%A7%E0%B0%95%E0%B0%82-%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%95-%E0%B0%AB%E0%B1%86%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%85%E0%B0%B5%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D/

  3. can u guys please answer how many years it takes to complete m.b.b.s ,just a graduate course along with rural service???nextly general medicine??next to dat superspeciality??? u know,even a p.g student should take rural recruitment after 2 years…even a diploma going m.b.b.s graduate should do the same….estimate the time buddies…answer it

  4. ఎమ్.బీ.బీ.ఎస్…హౌస్ సర్జన్..తర్వాత….తప్పనిసరి గ్రామీణ పోస్టింగ్….ప్రిపరేషన్ …తర్వాత..పీజీ…తర్వాత..తప్పనిసరి గ్రామీణ పోస్టింగ్……..మళ్ళీ ప్రిపరేషన్…. తర్వాత సూపర్ స్పెషాలిటీ…..తర్వాత… తప్పనిసరి గ్రామీణ పోస్టింగ్…రాగానే రిటైర్ మెంట్…..మడిసికీ గొడ్డుకీ తేడా ఏముంది సెగ్రెటరీ….?

  5. ఎందుకీ నిర్లక్ష్యం? ఎం బీ బీ ఎస్ లో జాయిన్ అయ్యేముందే తెలుసు కదా గ్రామీణ ప్రాంతాల్లో చెయ్యాలని? మరి ఎందుకు జాయిన్ అవడం? మానేసి హప్పీగా ఏ కర్నాటకలోనో లేకా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలోనో చదువుకోమనండి. ఎవరూ వద్దనలేదుకదా? రూరల్ పోస్టింగ్ అనేది తప్పనిసరి తద్దినంగా చేస్తున్నారు అన్నది నిజమే కానీ ప్రభుత్వం నుండి దానిని సరిదిద్దే సూచనలు లేనప్పుడు మీరు ఆ తద్దినం ఉందని తెలిసీ మొండిగా ప్రవర్తించడం మీ భాద్యతా రాహిత్యం కాదా?

    పేషంట్ ఖర్చులు వైద్యులపై చూపుతున్నరన్నది అబద్దం కానీ మైన్తినన్స్ ఖర్చులు చూపుతున్నారు ఎందుకంటే వాళ్ళు పొందేది ట్రైనింగ్ కాబట్టి ట్రైనింగ్ ఖర్చులు ఎవరిఖాతాలో వేస్తారో మీరు ఆలోచిస్తే తెలుస్తుంది.

    సామాన్యుడు పేరుపెట్టుకొని అసామాన్యులకు వత్తాసుపలుకుతున్న ఓ మాయావీ మీ మేధస్సుకి జోహార్లు. ఇకనైనా మీ సొంతపేర్లతో బ్లాగులు రాసి సామాన్యుడిని సామాన్యులకే వదిలేయండి.

  6. డాక్టర్ల తయారీకయ్యే ఖర్చునే లెక్క పేడతారేం?మిగతా అన్ని గ్రూపుల్నీ లెక్కల్లోకి తీయండి..మరోటీ ఒకో డాక్టరు వల్లా వాళ్ళు చేసే రోగ నివృత్తి వల్లా ఎన్ని పని దినాలు గైన్ అవుతాయో?ఒకొ డాక్టరు పే చేస్తున్న పన్నులూ… మునిసిపాలిటీకి గానీ ప్రొఫషనల్ టాక్స్ లూ కమర్షియల్ టాక్సులూ…అలాగే ఒక నర్సింగ్ హోం ద్వారా వాళ్ళు కలుగచేసె జాబ్స్..లాబ్ ల్లో గానీ మెడికల్ షాపుల్లో గానీ..లెక్క వేస్తే…ఒకో డాక్టర్ వల్లా చాలా ఆదాయం..ఉపయోగాలు మంచి జరుగుతున్నాయి…డాక్టర్ ల మీద చెడు అభిప్రాయలు వాళ్ళ వ్యాపార్యరీత్యా అనివార్యం గా వస్తున్నాయి..గానీ జెలసీ తో వాళ్లపై కుళ్ళు కక్కడం అర్ధ రహితం…గ్రామీణ పోస్టింగ్ వల్ల అధ్బుతాలు జరిగి పోవు…అది ఈ పనిక మాలిన నాయకులు తెచ్చిన మరో పనికిమాలిన ఆలోచన తప్పా…..చదువు చెప్పాం గాబట్టీ బలవంతంగా సంసారం చేయాలనే నిబంధన లేమిటీ…ఉద్యోగాలివ్వమనండీ…చేస్తారుగా… ఇలాంటి తప్పుడు దారులు ఈ గవర్నమెంట్ లు ఎందుకు వెతకాల్సి వస్తుంది?గ్రామేణ ప్రాంతాల్లో రెగ్యులర్ జాబ్ లివ్వకుండా…బేవార్సు రూల్స్ పెట్టి బలవంతంగా వాళ్ళను ఎందుకు ఇరికిస్తున్నారు…సమస్య లోతుల్లొకి చూడండి…బలవంతపు గ్రామీణ సర్వీసు మూడేళ్ళే ఎందుకు ఉండాలీ..పదేళ్ళ కు ఫిక్స్ చేయొచ్చుగా??

  7. గ్రామీణ ప్రాంతాల్లొ రెగ్యులర్ డాక్టర్లను నియమించకుండా ఈ లఫంగి నాయకులూ…ఐఏఎస్ లూ జూడాలని బలి చేస్తున్నారు…

    http://kvsv.wordpress.com/2012/02/03/%E0%B0%88-%E0%B0%AA%E0%B0%A7%E0%B0%95%E0%B0%82-%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%95-%E0%B0%AB%E0%B1%86%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%85%E0%B0%B5%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D/

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )