ఏనుగును కప్పి ఏమార్చగలవా??

ఎన్నికల సంఘం నిర్నయాలు ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపిస్తాయి..
యూపీ ఎన్నికల సందర్భంగా మాయావతి పెట్టిన ఏనుగు బొమ్మలను కప్పి వుంచాలని ఆదేశాలు జారి చేసారు. అసలు ఆ ఏనుగుల బొమ్మలు కప్పడానికి ఎంత ఖర్చవుతుంది? కప్పినా అవి ఏనుగులవి అని జనానికి తెలియకుండా వుంటుందా?? మరి కప్పి ఎవరిని మభ్యపెట్టడానికి? వాటిని పూర్తిగా తొలగించే పని ముందుగా చేపట్టి వుండాల్సింది.
అసలు ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో వుంటే వారి నాయకుల పేర్లను పథకాలకు, వీదులు, నగరాలకు, ప్రభుత్వ భవనాలకు నామకరణం చేస్తూ ప్రభుత్వ వాహనాలపై ముద్రిస్తూ పోతూ ఆ తరువాత ఎన్నికలప్పుడు వాటిని కప్పి వుంచమనడం కంటే ప్రజా ధనంతో చేపట్టే కార్యక్రమాలకు రాజకీయ ప్రేరేపిత పేర్లను పెట్టడం నిషేధిస్తూ చట్టాన్ని చేసి అమలు చేయించాల్సిన బాధ్యత ముందుగా చేపట్టాలి. లేకపోతే పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్టుగా వుంటుంది..
Like this:
One blogger likes this post.
Posted by saamaanyudu on 14/01/2012
http://saamaanyudu.wordpress.com/2012/01/14/%e0%b0%8f%e0%b0%a8%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%a8%e0%b1%81-%e0%b0%95%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf-%e0%b0%8f%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b0%97%e0%b0%b2%e0%b0%b5%e0%b0%be/