లక్షకొలువులు ఇచ్చేశాం అని సిఎం గారి ప్రకటన చూస్తే నవ్వొస్తోంది. ఈమధ్య ఈ యువకిరణాల ఉద్యోగాలపై గ్రామాలలోని యువకులు తామిచ్చిన కొలువులలో చేరారా లేదా అని విచారణకు గ్రామస్థాయి కమిటీలు వేసారు. నేనూ తిరిగా.. కానీ అందులో పేర్కొన్న కంపెనీలలో ఒక్కడు చేరలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారమే లేదు. అసలు ఆ జాబితాలో ఇచ్చిన పేర్లలో 5 శాతానికి మించి ఎవరూ ఆ ఊళ్ళలో లేరు. ఏ ఊరివారో తెలీలేదు. అది స్వయంగా జిల్లా ఎంప్లాయ్ మెంటు ఎక్స్చేంజీ వారిచ్చిన జాబితా. సెక్యూరిటీ గార్డు పోస్టులలో స్వంత ఖర్చులతో చేరిన వారి పేర్లుకూడా వీళ్ళు కలిపేసుకున్నారు. ఇది మా పరిశీలనలో తేలిన అంశం. ఎందుకయ్యా ఇలా జన్నాన్ని మోసగిస్తారు??
ప్రజలలో చైతన్యం లేకపొతే ప్రతీ వాడూ ఇలాగే మోసం చేస్తాడు. ప్రజల నుండి దేనికీ స్పందన లేకపోవడం అందరికీ లోకువైపోయింది. ఆ కారణంగానే “ఆ మనని ఎవరు అడుగుతారులే” అన్న నిర్లక్ష్యంతోనే ఇలాంటి పనులు చేస్తున్నరు. ఇప్పటికైన ప్రజలు మేలుకుని “ఇదేమిటని” చెవులు మెలేస్తే, మన పనికి మాలిన రాజకీయ నాయకులు వళ్ళు దగ్గర పెట్టుకుంటారు….
మీ ఆశ నెరవేరాలని నా ఆకాంక్షకూడా…