ఈ రోజు వార్త దినపత్రికలో ఈ వార్త చదివి ఆశ్చర్యమేసింది..
నాలుగువందల రూయల జేబు దొంగతనం చేసిన వ్యక్తికి ఓ ఏడాది జైలు శిక్ వంద రూపా జరిమానాను వేసారు విశాఖపట్టణంలో గౌరవనీయ స్థానిక మేజిస్ట్రేటు వారు.
మరి ఇన్ని లక్షల కోట్ల కుంభకోణాలు చేసిన వారికి ఎన్నేళ్ళు శిక్ష ఎంత జరిమానా వేయాలి. ఏమిటో కడుపు జరక్కో, చిల్లర పనులకో ఆశ పడి జేబు కత్తిరిస్తే పాపం ఓ ఏడాది జైలు.
ఈ ఘరానా దొంగలకు నిజంగా శిక్షపడుతుందా?? అరెస్టైనా జైలులోనూ ప్రత్యేక సౌకర్యాలు, అనారోగ్యం పేరుతో ఆసుపత్రులలో వైద్యాలు.. ఇదీ మన నేర శిక్షాస్మృతి…
ఉన్నోడికి మేసినంత.. లేనోడికి కడుపుమంట…