ఈశాన్య రాష్ట్రాలలో అమలు కాబడుతున్న ప్రత్యేక సైనికాధికార చట్టానికి వ్యతిరేకంగా గత పదకొండేళ్ళుగా పోరాడుతున్న ఇరోం షర్మిళకు మద్దతు తెలుపుదాం.. కృత్రిమంగా ఆహారాన్ని సరఫరా చేస్తూ నిర్బంధాన్ని అమలు చేస్తున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా మేధావులు ప్రజాస్వామిక వాదులు విరివిగా కదలి రావాలసిన అవసరముంది. అన్నా హజారే దీక్షకు మద్ధతుగా కదిలిన జనం, రాజకీయ పార్టీలు గత పదకొండేళ్ళూగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న షర్మిళ పట్ల అనాగరికంగా కిమ్మనకుండా వుండటానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తో పాటు ఒకే తానులోని గుడ్డలైన రాజకీయ వర్గాలు ఈ విషయంలో మౌనం దాల్చడం నేరం.. కౄరమైన చట్టాలను ప్రయోగిస్తూ పౌరుల హక్కులను హరించి వేస్తున్న పాలక వర్గాలన్నీ ఒకటిగానే కనిపిస్తున్నాయి. దీనికి మీడియాకూడా వంత పాడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న షర్మిళ పోరాటానికి మద్ధతు తెలుపుదాం.. AFSPA ను తక్షణమే రద్దు చేయాలని గొంతు కలుపుదాం..
