‘జాతిపిత’ మహాత్ముడు కాదా?

భారత ప్రజలలో అత్యధిక శాతం మంది నారాయణుని దశావతారాలలో ఒకడిగా, తమ జాతిపితగా, మహాత్ముడిగా ఆరాధిస్తున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ లోని సామాన్యుని కోణాన్ని వెలుగులోకి తెస్తున్నట్లుగా చెప్పుకుంటూ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన జేడ్ ఆడమ్స్ రాసిన ‘గాంధీః నేకెడ్ యాంబిషన్’ అనే పుస్తకం ఆయన లోని శృంగారం విషయంలో ఆయనలోని బలహీనతలను ఎత్తిచూపించింది. వయసు పైబడ్డాక కూడా అనుచరుల భార్యలతోను, మేనకోడలు వరుసయే టీనేజ్ పిల్లలతోనూ ఆయన ప్రవర్తించిన తీరును అక్షరబద్ధం చేసిన ఈ పుస్తకం అసామాన్య వ్యక్తిలోని అల్పత్వాన్ని సోదాహరణంగా వివరిస్తోందంట. యూరప్ లో తాజాగా విడుదలై అప్పుడే వివాదాలకు తెరలేపుతోంది.

గాంధీ దృక్పథం శృంగారం విషయంలో అసహజంగా, అస్వాభావికంగా వుందన్న విషయాన్ని దేశవిభజన సమయంలోనే నెహౄ గ్రహించారంట. ఈ స్వభావం కారణంగానే జె.డి.కృపలానీ, వల్లభాయి పటేల్ వంటి నాయకులు ఆయనకు దూరంగా జరిగారంట.

సెక్స్ పట్ల ఆలోచనలను అదుపులో వుంచుకోవడానికి గాంధీ విపరీతంగా ప్రయోగాలు చేశారంట. తన కోరికలు అదుపులో వున్నాయోలేవో చూడటానికి అమ్మాయిలను తన పక్కనే నగ్నంగా పడుకోపెట్టుకోవడం, వాళ్ళు స్నానం చేస్తుంటే కళ్ళుమూసుకుని అక్కడే ఉండటం, తాను స్నానం చేసుకునే ముందు మసాజ్ చేయించుకోవడం యిదివరకే చాలామందికి తెల్సిన విషయాలు. వీటికి మరికొంత యీ పుస్తకంలో జోడించారు.

యివన్నీ చదువుతుంటే ఈ మధ్య మన మాజీ గవర్నర్ తివారీ, యిటీవలి నిత్యానంద స్వామి రాసలీలలు గుర్తుకొస్తున్నాయి. యిలా అంటే చాలా మందికి ఆగ్రహం రావచ్చు. కానీ యిది ఆ ప్రయోగాల బారిన పడ్డా అమ్మాయిల మానసిక క్షోభను గురించి ఆలోచిస్తే ఎంత అసంబద్ధంగా, జుగుప్సాకరంగా వుంటుందో కదా?

(నిన్నటి ఆంధ్రజ్యోతి నవ్య లోని కథనం, జీ 24 channel లోని చర్చ చూసి)

9 thoughts on “‘జాతిపిత’ మహాత్ముడు కాదా?

  1. ఇవన్నీ ఇంతకుముందే తెలిసినవి.గాంధీ తన నియంత్రించలేని కామ వాంఛ గురించి తన ఆత్మ కథ లో రాసుకొన్నారు. కాబట్టీ గాంధీ జీ విశ్వసనీయతని, పాశ్చాత్య మీడియా విశ్వసనీయత తో పోల్చి చూస్తే మనకు విషయం స్పష్టమౌతుంది. ఆ పుస్తకం రాసినతను ఏదొ నాలుగు వివాస్పద వ్యాఖ్యలు చేసి నాలుగు పుస్తకాలు అమ్ముకొని, ఓ పది రాళ్ళు వెనకేసుకొందామని రాసి ఉంటాడు. మనం గనుక మన బ్లాగ్ కి నలుగు హిట్లు ఎక్కువ తగలాలని ఏదో ఒక వివాదాస్పద విషయం గురించి రాసినట్లు.
    ఆమ్మాయిల ఇష్టంలేకుండా గాంధీ అలా చేశారా? ఒక వేళ చెశారు అని ఎవరైనా నిరూపిస్తే గాంధీ తప్పు చేసినట్లే లెక్క. కానీ ఒక్కటి నిజం, గాంధీ ఇప్పుడు ఉండి ఉంటే,ఆయన ఈ విషయం గురించి నిజాయితీ తోనే స్పందించి, తన తప్పు ఉంటే ఒప్పుకొనే వారు.అందులో సందేహం లేదు. ఇందులో మీకేమైనా సందేహం ఉంటే ఆయన ఆత్మకథ చదవండి.
    ఇప్పుడు గాంధీ ఎంతమాత్రం జాతి పిత కాదు. అంబేద్కర్ జాతి పిత.

    • మీరు వెటకారంగా అన్నా సరే ఒక నిజం మీ మనస్సు నుండి బయటకు వచ్చింది. నిజమే జాతికి ప్రస్తుతం కావలసింది గాంధీ తత్వం కాదు. జాతి మొత్తం బాబా సాహెబ్ చూపించిన దారిలో నడవాల్సి వుంది.దేశంలో ౭౦ శాతం మంది ఆకలి కేకలు వేస్తుంటే దేశం ఏమీ అభివృద్ధి పధంలో దూసుకుపోలేదు.దేశమంటే కొంతమంది మాత్రమే అనుకునే యిరుకుమనస్సున్న వారికి యిది మామూలే అన్పిస్తుంది.
      గాంధీ ఒక్కరే స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డాడని చెప్పేవారు జాతికోసం ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలిన మిగిలిన నాయకులను అవమానించడమే . క్రిప్స్ రాయభారం గురించి చదివిన వారెవ్వరూ గాంధీ ఒక్కడే త్యాగం చేసాడంటే నవ్విపోతారు. కుమార్ వర్మ గారన్నట్లు వ్యక్తి పూజకు అలవాటు పడిన వారి మాటలు,నిజాలను ఒప్పుకోలేని వారి బలహీనతను తెలియజేస్తాయి. గాంధీని జాతీయ నాయకుడ్ని చేయడం కోసం వందలాది జాతి ముద్దుబిడ్డలు ప్రాణాలు వదులుకున్నారు. భగత్ సింగ్, బోస్… మొదలైన వారెందరో.

      • యోహాన్జీ ఈ కాంట్రవర్శీ సబ్జెక్టులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.. ఆరాధించే వారిపై ఏమైనా అంటే తట్టుకునే మనఃస్తత్వం మనకుండదు. అది అబద్ధపు ప్రచారంగా అనుకుంటే హాయిగా వుంటుంది..జాతిపితలుగా ఎవరినైనా కీర్తించడమెందుకు? తద్వారా వారి లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నాన్ని స్వాగతించడమే..అసలు జాతులుగా గుర్తింపేమటి? భారత జాతి అంటూ ఒకటి లేదుకదా? ఈ దేశమే కొన్ని వేల తెగల, కులాల, జాతుల సమాహారం. ఇక్కడ ఆధిపత్య భావజాలానిదే ప్రస్తుత అధికారం. దీనిఒకి వ్యతిరేకించిన వారు జాతి ద్రోహులు, దేశ ద్రోహులవుతున్నారు..స్వేచ్చా స్వాతంత్ర్యాల గూర్చి ఎంత తక్కువ మాటాడుకుంటే అంత బుద్ధిమంతులు.

  2. గాంధీజీ మీద కూడా పడ్డారా…. కానివ్వండి…. ఆయన గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా కారు కూతలు కూస్తుంటారు. వాటిని గురించి ఎవరూ పట్టించుకోరు.

  3. గాంధీజీ తన ఆత్మకథలో ఇటువంటి విషయాలు నిజాయితీగానే వ్రాసారు. శృంగార ఆపేక్షతో తన తండ్రి ఆరోగ్యం కూడా పట్టించుకోలేదని బాధ వ్యక్తం చేసారు. ఆతర్వాత ఆయన సంసార సుఖం వదులుకొని యోగ సాధన కూడా చేసారు. ఏదిఏమైనా ఈ విషయంలో నేను బొందలపాటిగారితో ఏకీభవిస్తున్నాను.

  4. గాంధి గారు కొరికలని చంపుకొలేని మామూలు మనిషె,సరె,మరి నెహ్రూ,ఇందిర ల వంశం వాళ్ళ గురించి బుక్ రాసె ధైర్యం ఎవరూ ఎందుకు చెయ్యరో.ఎందుకు అంటే చేతిలొ అధికారం వున్నవాళ్ళంటే అందరికీ దడ కదా. ఎపుడు చూడండి పాపం గాంధి గారి మీద పడీ ఏడుస్తూ వుంటారు.ఆ మధ్య ఎక్కడో చదివాను,సాధారణంగా సొషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో వీ లవ్ ఏబీసీ అనో వీ హేట్ ఏబీసీ అనో ఒక సెలిబ్రిటీ మీద గ్రూప్స్ సహజం.అలాగే ఎవరో సికిందరాబాద్ కుర్రకుంక “వీ హేట్ ఆధిష్టనం అమ్మ” అని ఒక గ్రూప్ నెలకొల్పాడుట.వాడిని ఐపీ అడ్రస్ ఆధారం గా వెతికి మరీ పట్టుకెళ్ళారు మన పోలీసులు.

  5. ఆర్యా, నమస్కారములు.

    బొందలపాటి వారితో, కత్తి మహేష్ గారితో నేనుకూడా ఏకీభవిస్తాను. ఆయన తన బలహీనతలను,బలాలను కూడా బాహాటంగా చెప్పుకున్నారు. కేవలం స్త్రీ లోలుడైతే, ఆంగ్లేయులు ఆయన్ని ఎప్పుడో బుట్టలో వేసెసేవారు; అప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చేదీకాదు. మనో నిబ్బరం కలవాడే కాబట్టి, జాతిని ఒక తాటిపై నడిపిచ్చి, ఆంగ్లేయులను సాగనంపగలిగాడు ఆ మహాత్ముడు.
    భవదీయుడు,
    మాధవరావు.

  6. స్పందించిన అందరికీ వందనాలు. ఓ గొప్ప వ్యక్తిగా కీర్తింపబడ్డ మనిషిపై వచ్చే ఆరోపణలను ఆధారం లేకుండా రాయలేరు కదా? యిందులో అందరి అభిప్రాయం ఈ మచ్చ ఆయనకు ఏమీ కాదు అన్నదే. ఎందుచేతనంటే ఆయన వున్న స్థానం అలాంటిది. మన మనస్సు అంత తొందరగా అంగీకరించదు. యిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు కూడా. వ్యక్తి ఆరాధన పరాకాష్ఠకు మనం దూరం కానంతవరకు కొన్ని విషయాలు మింగుడు పడవు.
    మరో విషయం ఆయనే స్వాతంత్ర్యం సిద్ధింప చేసారన్న భ్రమలలోంచి కూడా మనం బయటకు రాలేదు. ఆనాటి ప్రపంచ పరిస్థితులలో బ్రిటిష్ వారి ఆధిపత్యం మసకబారుతున్న కారణంగా, సోషలిస్టు రాజ్యాలేర్పడుతున్న సందర్భంగా యిక్కడి వారి వామపక్ష భావాలు తీవ్రమైన తిరుగుబాటు వైపు మరలక ముందే అధికార మార్పిడికి అంగీకరించి, యిప్పటికి కామన్ వెల్త్ దేశంగా తమ అడుగుజాడలలో నడిచే విధంగా ఏర్పాటు చేసుకున్నారు.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )