ఇన్నాళ్ళు అందరి తరపునా గొడుగులా కాపాడిన
చేతులు కోల్పోవడం నేటి విషాదం…
తరుముకొస్తున్న కాలం పులి ఒక్కొక్కర్నీ తన నోట కరచుకు పోతుంటే
మరో వైపు వేటగాడి తూటాకు బలవుతున్న లేళ్ళ గుంపు…
నీ గురించి నా గురించి అరిచి అడిగే వారు కరువవుతూ
ఒంటరి తనం వైపు నెట్టబడుతూ
చీకటి మూలల ఒదిగిపోతున్న కాలం…
కానీ…
యింక మనకు మనమే నిలబడి కలబడాల్సిన సమయమిది…